ప్రపంచ వేదిక పై మరోసారి మెరిసిన బహ్రెయిన్..!!
- April 11, 2025
మనామా: బహ్రెయిన్ మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది. 2025 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డులలో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం పాస్‌పోర్ట్ సేవలు ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచాయి. వరుసగా రెండవ సంవత్సరం "ఉత్తమ విమానాశ్రయ పాస్‌పోర్ట్ సేవలు" విభాగంలో అవార్డును పొందింది. సమర్థవంతమైన, వేగవంతమైన విధానాలు, విమానాశ్రయంలో సందర్శకులను స్వాగతించడంలో పాస్‌పోర్ట్ నియంత్రణ సిబ్బంది వృత్తి నైపుణ్యం వంటి ప్రమాణాల్లో మెరుగైన ఫలితాల కారణంగా ఈ అద్భుతమైన విజయం సాధ్యమైందని జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాల అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేకతను సాధించడంలో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ పాస్‌పోర్ట్ సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు.
బహ్రెయిన్ కంటే ముందు స్థానాల్లో హాంకాంగ్ , సింగపూర్ విమానాశ్రయాలు నిలిచాయి. 1989లో ఒక ప్రముఖ బ్రిటిష్ కన్సల్టింగ్ సంస్థ స్థాపించిన స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డులు.. విమానయాన పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటిగా భావిస్తారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!