2026లో ప్రారంభం కానున్న భారత్ మార్ట్..!!
- April 11, 2025
యూఏఈ: భారతీయ ఉత్పత్తులను అందించే భారత్ మార్ట్ 2026 చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. జెబెల్ అలీ ఫ్రీ జోన్ (JAFZA)లో నిర్మాణంలో ఉన్న భారత్ మార్ట్ 2.7 మిలియన్ చదరపు అడుగులకు పైగా రిటైల్, షోరూమ్‌లను కలిగి ఉంది.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భారత్ లో తన మొదటి అధికారిక పర్యటనను ముగించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. చైనీస్ డ్రాగన్ మార్ట్‌తో పోలిస్తే, భారత్ మార్ట్ దుబాయ్‌లో బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) మార్కెట్‌ప్లేస్‌గా ఉంటుందని, ఇది భారతీయ వ్యాపారాలు, ప్రపంచ మార్కెట్ల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ భారత్ మార్ట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని DP వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయెమ్ ప్రకటించారు.
జెబెల్ అలీ పోర్ట్ నుండి కేవలం 11 కి.మీ దూరంలో, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 15 కి.మీ దూరంలో ఉంటుంది. భారత్ మార్ట్, భారతీయ వ్యాపారాలకు మల్టీమోడల్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను ఎతిహాద్ రైలు అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







