2 వారాల నవజాత కుమార్తె మొదటి ఫోటో షేర్ చేసిన షేక్ హమ్దాన్..!!
- April 12, 2025
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన 2 వారాల చిన్నారి ఫోటోను షేర్ చేశారు. అతని కుమార్తె హింద్ మార్చి 22న జన్మించింది. ఆ తర్వాత, తన నాల్గవ బిడ్డ జన్మించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.షేర్ చేసిన ఫోటోలో షేక్ హమ్దాన్ తన కుమార్తెను పట్టుకుని ప్రేమగా చూస్తున్నాడు. తెల్లటి దుస్తులలో ఇద్దరు మెరిసిపోయారు. ఈ ఫోటోకి గులాబీ హృదయాలతో పాటు ఇంగ్లీష్, అరబిక్‌లో 'హింద్' అని తన కుమార్తె పేరును రాశారు. పోస్ట్ చేసిన గంటలోపు, దానికి వేలాది కామెంట్స్ వచ్చాయి. దాదాపు 17 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.ఇటీవల, అతను భారతదేశ పర్యటన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో భారత క్రికెట్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లను కలిసినప్పటి దృశ్యాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







