ఎట్టకేలకు 1959లో జన్మించిన వ్యక్తికి బర్త్ సర్టిఫికేట్..!!
- April 13, 2025
మనామా: బహ్రెయిన్ ఓ వ్యక్తి నిరీక్షణ ఫలించేందుకు 69 సంవత్సరాలు పట్టింది. చివరకు అతని దీర్ఘకాల కోరిక నెరవేరింది. తన బర్త్ సర్టిఫికేట్ ను అధికారికంగా పొందారు. వివరాల్లోకి వెళితే.. 1959లో జన్మించిన ఆ వ్యక్తికి తన జననాన్ని నిరూపించడానికి అధికారిక పత్రాలు లేవు. అధికారుల వద్ద వారి పుస్తకాలలో అతని గురించి ఎటువంటి రికార్డు లేదు. పరిస్థితిని సరిదిద్దడానికి అతను సమాచార , ఇ-ప్రభుత్వ అధికారాన్ని సంప్రదించినప్పుడు, వారు అతనికి కోర్టు ఉత్తర్వు అవసరమని పేర్కొంటూ అతనిని తిప్పిపంపారు.
న్యాయవాది జైనాబ్ మదన్ ఆధ్వర్యంలో ఆ వ్యక్తి తన కేసును మూడవ మైనర్ సివిల్ కోర్టు ముందు సమర్పించాడు. కోర్టు అతని పాస్‌పోర్ట్‌తో సహా సమర్పించిన పత్రాలను పరిశీలించింది. కోర్టు అతనికి జనన ధృవీకరణ పత్రం జారీ చేయాలని సమాచార, ఇ-ప్రభుత్వ అధికారాన్ని ఆదేశించింది.
ఆ వ్యక్తి డిసెంబర్ 31, 1959న మనామాలో జన్మించాడని కోర్టు కూడా నిర్ధారించింది. 2000 డిక్రీ-చట్టంలో పేర్కొన్న చట్టపరమైన విధానాలకు అనుగుణంగా, న్యాయమూర్తి ఈ విషయాన్ని పేరు, జనన రికార్డు వివాదాలను పరిష్కరించే ప్రత్యేక కమిటీకి బదిలీ చేశారు. కమిటీ అతని దరఖాస్తును సమీక్షించి, దానికి ఆమోదాన్ని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్