గల్ఫ్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుండి అందుబాటులోకి బాడీ ఫ్రీజర్
- April 13, 2025
తెలంగాణ: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంపెల్లి వెంకట్రావుపేట్ గ్రామాలకు చెందిన వివి రావుపేట్ గల్ఫ్ సంఘసభ్యులు,గల్ఫ్ కుటుంబ సభ్యులు,గ్రామ ప్రజలతో ఆదివారం స్థానిక పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
రెండు గ్రామాలకు సేవ చేయడానికి ఈ వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం ఏర్పడిందని, గల్ఫ్ కార్మికుల కుటుంబాలకి ప్రమాదవశాత్తు ఏదైనా జరుగుతే కన్నవారి కుటుంబ సభ్యుల కడచారి చూపు చూసుకోవాలనీ గల్ఫ్ కార్మికుల అందరినిర్ణయం ప్రకారం డెడ్ బాడీ ఫ్రీజర్ ను గల్ఫ్ వి. వి.రావుపేట్ సంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు నేటి నుండి బాడీ ప్రీజర్ అందుబాటులో ఉంటుందని గల్ఫ్ సంఘ నాయకులు ఈ మీటింగ్ నందు నిర్ణయం తీసుకోన్నారు.అలాగే గతంలో కూడాగల్ఫ్ కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతోమందికి సహాయం చేశామని,మున్ముందు మరిన్ని సేవ కార్యక్రమలు,సహాయాలు చేయడానికి ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు.భవిష్యత్తులో పరాయి దేశంలో ఉన్నటువంటి ఒక్క గల్ఫ్ కార్మికుని కూడాఏ ఆపద వచ్చిన కూడా వారి కుటుంబ సభ్యులకు ఈ సంఘం వారికి భరోసాగా ఉంటుందని,గ్రామ అభివృద్ధి మరియు గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కావలసినటువంటి ఉపాధి లేక ఏదైనా శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సంఘం పలు సేవలు చేస్తున్నది అంటే కన్న ఊరు మీద ప్రేమ మరియు సేవాభావం ఉన్నవారే ముందుండి కలసి కట్టుగా నడిపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేసారు.సంఘం నిర్మాణంకి, బాడీ ఫ్రిజర్కి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు, నాయకులు.గల్ఫ్ సంఘo అధ్యక్షులు పెనుకుల అశోక్, నిర్వాహకులు నలిమెల్ ప్రసాద్, అరెల్లి మహేష్, Bl.నారాయణ గౌడ్, పోతు రఘు, గుగ్లావత్ శ్రీకాంత్,శ్రీను,మాచర్ల రఘుపతి,శ్రీమాన్,రవీందర్ చారి, రోడ్డు రాజశేఖర్,వేల్పుల రాజేందర్.కండేలా వేంకటి. ఆకుల సతీష్. K.విశాల్, G.శ్రీనివాస్,మల్లేష్, నరేందర్, తిరుపతిబాపు.అన్నపు వెంకటేష్,మల్లేష్ సౌదీ.M.అది రెడ్డి, Md.హబ్బీ.భూమేశ్వర్,j. చంద్రయ్య, Md.రహేమ్,మేడపట్ల రాజేష్, మెండే ప్రవీణ్.పెనుకుల నరేష్, దబడి రవి, వేల్పుల మహేష్, సంద స్వామి.నాయకులు బిట్ల నరేష్, కొడిమ్యాల రవి,మచర్ల దశ రెడ్డి, రాజేందర్. మీనుగు చందు, బైన ప్రశాంత్, నూనె వంశీ. వేముల నరేష్,Dr.శేఖర్. ANM కోమల,మానస. సుజాత, సుమ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్