బాల్కనీలో బట్టలు ఆరబెడితే..Dh2,000 వరకు జరిమానా..!!

- April 14, 2025 , by Maagulf
బాల్కనీలో బట్టలు ఆరబెడితే..Dh2,000 వరకు జరిమానా..!!

యూఏఈ: అబుధాబిలో అధికారులు పబ్లిక్ రోడ్లపై బ్యూటీఫికేషన్ ను కాపాడటానికి, పట్టణ వాతావరణాన్ని కొనసాగించడానికి మార్గదర్శకాలను విడుదల చేశారు. వాటి ప్రకారం.. అబుదాబిలోని పబ్లిక్ రోడ్లకు ఎదురుగా ఉన్న కిటికీలు , బాల్కనీలపై క్లాత్స్, లేదా కార్పెట్‌లు, కవరింగ్‌లను శుభ్రం చేయడాన్ని నిషేధించారు.  ఉల్లంఘనలకు Dh2,000 వరకు జరిమానాలు విధించనున్నారు. మొదటిసారి ఉల్లంఘించిన వారికి Dh500 వరకు జరిమానా విధించబడుతుంది. రెండోసారి ఉల్లంఘన పునరావృతమైతే అధికారులు 1,000 దిర్హామ్‌లు, ఉల్లంఘనలు రిపీటైతే 2,000 దిర్హామ్‌లు విధించనున్నారు.
"అపార్ట్‌మెంట్ బాల్కనీలో బట్టలు ఆరవేయడం లేదా కిటికీ లేదా రైలింగ్‌కు వేలాడదీయడం భవనం  ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది. వీటిని ఇకపై అనుమతించరు." అని అబుదాబి మునిసిపాలిటీ మునుపటి ప్రకటనలో తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com