IPL 2025 టాప్ లో ఉన్న జట్టు ఇదే!

- April 14, 2025 , by Maagulf
IPL 2025 టాప్ లో ఉన్న జట్టు ఇదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించిన పాయింట్ల పట్టికలో ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఒక్కో జట్టు ఆరేసి మ్యాచ్‌లు ఆడగా, వరుస విజయాలతో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో దూసుకెళ్తోంది.రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు కూడా పోటీపోటీగా రన్‌రేట్ పరంగా తేడాలు చూపిస్తున్నాయి.

గుజరాత్ టైటాన్స్ దూకుడు
గుజరాత్ ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నలుగిట గెలుపొందగా, రన్‌రేట్ మెరుగుదల కారణంగా ఇతర జట్లను వెనక్కు నెట్టేసింది.అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాత్రం ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయింది.వరుస పరాజయాలతో CSK జట్టు చివరి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) లాంటి జట్లు కూడా నాలుగు విజయాలతో సమానంగా ఉన్నా, నెట్ రన్ రేట్ ఆధారంగా వాటి స్థానాలు మారిపోయాయి. ఆదివారం నాటికి ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడాయి. ఇక మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నాలుగో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్లు నిలిచాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్ కు చేరతాయనే విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచాయి. నెట్ రన్ రేట్ కారణంగా ఈ మూడు జట్లలో ముంబయి ఇండియన్స్ జట్టు ముందుంది.ప్లేఆఫ్ టికెట్లపై పోరు ఇంకా గట్టిగానే కొనసాగుతోంది.టాప్-4 స్థానాల్లో స్థిరపడాలంటే రన్ రేట్ మాత్రమే కాకుండా మిగిలిన మ్యాచుల్లో గెలుపు కీలకం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com