అబుదాబిలో E311 కనీస వేగ పరిమితి ఎత్తివేత..!!

- April 14, 2025 , by Maagulf
అబుదాబిలో E311 కనీస వేగ పరిమితి ఎత్తివేత..!!

యూఏఈ: అబుదాబిలో ట్రాఫిక్ భద్రతను పెంచడంతోపాటు భారీ ట్రక్కులకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు.  సంస్కరణల్లో భాగంగా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్ (E311)లో కనీస వేగ పరిమితి వ్యవస్థను 120kmph ఎత్తివేయనున్నట్లు అబుదాబి ప్రకటించింది. ఇకపై  వాహనదారులు 120kmph కనీస వేగానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అబుదాబి ప్రకటించింది.ఈ మార్పు అన్ని వాహనాలకు వర్తిస్తుందని, ముఖ్యంగా పెద్ద వాహనాలతో రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించే వారికి మెరుగైన, సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఏప్రిల్ 2023లో అబుదాబి E311లో కనీస వేగ పరిమితిని 120kmphగా నిర్ణయించారు. ఈ ప్రధాన రహదారిపై గరిష్ట వేగం 140kmph, ఎడమ నుండి మొదటి, రెండవ లేన్‌లలో కనిష్ట వేగం 120kmphగా ఉంది. కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన డ్రైవర్లకు జరిమానా కింద Dh400 జరిమానా విధించబడుతుంది. అలాగే నెమ్మదిగా డ్రైవింగ్ చేసినా జరిమానా విధిస్తారు.

    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com