కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు..!!

- April 17, 2025 , by Maagulf
కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు..!!

దుబాయ్: బుధవారం సాయంత్రం బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్‌లో గ్రాముకు Dh400 కంటే తక్కువగా ఔన్సుకు $3,300 దాటింది. అమెరికా-చైనా సుంకాల యుద్ధం,  బలహీనమైన డాలర్ కారణంగా విలువైన బంగారం ధరలు ఔన్సుకు $3,300 దాటిపోయాయి. దుబాయ్‌లో 24K గ్రాముకు Dh400 కు కొద్దిగా తక్కువగా ఉంది. ఇతర వేరియంట్లలో 22K, 21K, 18K వరుసగా గ్రాముకు Dh369.5, Dh354.5, Dh303.75 లకు పెరిగాయి. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిరంతర అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందని యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD) హెచ్చరించింది. అమెరికా, చైనా  ఇతర దేశాల మధ్య ప్రపంచ సుంకాల యుద్ధం మరింత పెరిగితే, సురక్షితమైన బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయని, దాంతో వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఆర్థిక సంస్థలు ఇటీవల బంగారం ధర అంచనాలను సంవత్సరాంతానికి $3,700,  2026 మధ్య నాటికి $4,000 కు పెరుగుతాయని సాక్సో బ్యాంక్ కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సెన్ విశ్లేషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com