'ట్రూజెట్' విమాన సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి
- July 12, 2015
వైమానిక రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ రివ్వున దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ నేతృత్వంలోని 'ట్రూజెట్' పౌర విమానయాన సంస్థ సేవలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని టర్బో విమాన సేవలను ప్రారంభించారు. హైదరాబాద్ - తిరుపతి మధ్య తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. రామ్ చరణ్ తేజ ట్రూజెట్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టర్బో మేఘా డైరెక్టర్‌గా ఉన్న రామ్ చరణ్ తేజ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, సంస్థ డైరెక్టర్లు ప్రేమ్ కుమార్, ఉమేశ్ తదితరులు హాజరయ్యారు. కాగా శనివారం సాయంత్రం ట్రూజెట్ విమానానికి రేణిగుంట విమానాశ్రయంలో చిరంజీవి కుటుంబ సభ్యలు పూజలు నిర్వహించారు. అనంతరం అదే విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







