SMS స్కామ్.. క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఛేదించిన అధికారులు..!!
- April 22, 2025
దోహా, ఖతార్: బ్యాంకులు, అధికారిక ప్రభుత్వ సంస్థల వలె నకిలీ లింక్‌లు, మోసపూరిత SMS లను పంపుతున్న ముఠా నెట్ వర్క్ ను ఖతార్ అధికారులు ఛేదించారు. పలు మోసాలకు పాల్పడుతున్న ఖతార్‌లోని వివిధ ప్రాంతాలలో కమ్యూనికేషన్ టవర్‌లను లక్ష్యంగా చేసుకున్న 12 మంది ఆసియా సంతతికి చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి క్రిమినల్ నెట్‌వర్క్‌ను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం విజయవంతంగా అడ్డుకుంది.
ఈ మోసపూరిత లింకులు, మెసేజులతో పౌరులు, నివాసితుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. క్రెడిట్ కార్డ్ డేటా, ఇతర సున్నితమైన సమాచారం చోరీ చేసి వాటిసాయంతో వారి ఖాతాలను ఖాళీ చేస్తారని అధికారులు వివరించారు.
SMS లేదా మెసేజింగ్ అప్లికేషన్‌ల ద్వారా వచ్చే ఏవైనా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏదైనా ఫ్రాడ్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!