ఒమన్ లో పోప్ ఫ్రాన్సిస్ కు నివాళులు..!!

- April 22, 2025 , by Maagulf
ఒమన్ లో పోప్ ఫ్రాన్సిస్ కు నివాళులు..!!

మస్కట్: పోప్ ఫ్రాన్సిస్ మరణానికి సోమవారం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందితో కలిసి ఒమన్‌లోని రోమన్ కాథలిక్ సమాజం సంతాపం వ్యక్తం చేసింది. 266వ పోప్ 88 సంవత్సరాల వయసులో మరణించారని వాటికన్ ధృవీకరించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా ఒమన్‌లోని కాథలిక్ చర్చిల ప్రీస్ట్-ఇన్-ఛార్జ్, ఘాలాలోని హోలీ స్పిరిట్ కాథలిక్ చర్చిలో పారిష్ ప్రీస్ట్ ఫాదర్ జార్జ్ వడుక్కుట్ OFM కాప్, సుల్తానేట్ అంతటా ఆయన ఫాలోవర్స్ నివాళులు అర్పించారు.

1936లో బ్యూనస్ ఎయిర్స్‌లో జార్జ్ మారియో బెర్గోగ్లియోగా జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 1958లో జెస్యూట్ క్రమంలోకి ప్రవేశించి 1969లో పాదర్ గా నియమితులయ్యారు. అణగారిన వర్గాలకు సేవ చేయడంలో ముందుండేవారు. అలా బ్యూనస్ ఎయిర్స్ ఆర్చ్ బిషప్ , తరువాత కార్డినల్ అయ్యారు.

2013 మార్చి 13న ఆయన పాపసీకి ఎన్నికవడం ఆధునిక చర్చిలో కీలక మలుపు.  ఆయన అమెరికా నుండి వచ్చిన మొదటి జెస్యూట్ పోప్,  సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి తర్వాత ఫ్రాన్సిస్ అనే పేరును తీసుకున్న మొదటి వ్యక్తి అయ్యారు.      

పోప్ ఫ్రాన్సిస్ 2019లో అరేబియా ద్వీపకల్పానికి వచ్చారు. ఇది ఒక పోప్ చేసిన మొట్టమొదటి పర్యటనగా గుర్తింపు పొందింది. ఈ పర్యటనలో ఆయన అబుదాబిలోని అల్-అజార్ గ్రాండ్ ఇమామ్‌తో మానవ సోదరభావంపై పత్రంపై సంతకం చేశారు. ప్రపంచ ఐక్యత, మతాంతర అవగాహన కోసం పిలుపునిచ్చారు.

పోప్ ఫ్రాన్సిస్‌ను అనేక సందర్భాల్లో కలిసే అవకాశం పొందిన ఫాదర్ జార్జ్ మాట్లాడుతూ.. “ఆయనతో ప్రతి సమావేశం దయగల క్షణం. అతని సున్నితమైన కళ్ళు క్రీస్తు ఉనికిని తెలియజేశాయి.” అని నివాళులర్పించారు. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన జీవితానికి కృతజ్ఞతా ప్రార్థనలు చేయడానికి ఈ వారం మస్కట్‌లో ప్రత్యేక స్మారక మాస్ నిర్వహించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com