గంట గంటకు పెరుగుతున్న బంగారం ధరలు..!!

- April 22, 2025 , by Maagulf
గంట గంటకు పెరుగుతున్న బంగారం ధరలు..!!

దుబాయ్: గత వారం రోజులుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. నిత్యం కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మంగళవారం కూడా ఈ ట్రెండ్ కొనసాగింది. దుబాయ్‌లో రికార్డు గరిష్టాన్ని తాకింది. 5 శాతం పైగా పెరిగి ఔన్స్‌కు $3,480ను అధిగమించింది. దుబాయ్‌లో ధరలు గ్రాముకు Dh420కి చేరుకున్నాయి.  

మంగళవారం 24K వేరియంట్ గోల్డ్ గ్రాముకు Dh420.0కి పెరిగింది. గత 24 గంటల్లో గ్రాముకు Dh15 పెరిగింది. అదేవిధంగా, మంగళవారం గ్రాముకు 22K Dh388.75కి పెరిగింది, సోమవారం ఉదయం నుండి గ్రాముకు Dh13 కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇతర వేరియంట్లలో 21K, 18K గ్రాముకు Dh372.75, Dh319.5 వద్ద ట్రేడయ్యాయి.  

యూఎస్ డాలర్ బలహీనత, US-చైనా వాణిజ్య ఉద్రిక్తతపై అనిశ్చితి కారణంగా యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9.20 గంటలకు స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3,480.22 వద్ద ట్రేడవుతోంది. ఇది 5 శాతం కంటే ముందుగా ఔన్సుకు $3,485ను అధిగమించింది.

ఇటీవల బంగారం కోసం తమ అంచనాలను రీసెర్చ్ సంస్థలు ఔన్సుకు $3,500కు పెంచాయి. వాటిలో చాలా వరకు వచ్చే ఏడాది అది $4,000కి చేరుకుంటుందని అంచనా వేసింది. కానీ ఇదే అనిశ్చితి కొనసాగితే, ఈ సంవత్సరం విలువైన లోహం $4,000 మార్కెట్‌ను తాకవచ్చని భావిస్తున్నారు.  

"బలహీనమైన US డాలర్ కారణంగా బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి చూపుతున్నారు. ఆ కారణంగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా బలపడే అవకాశం ఉంది" అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌లో భారతదేశం తరపున పరిశోధన చేస్తున్న కవితా చాకో అన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com