బ్యూనస్ ఎయిర్స్ బుక్ ఫెయిర్ 2025.. రియాద్ పెవిలియన్ ప్రారంభం..!!

- April 24, 2025 , by Maagulf
బ్యూనస్ ఎయిర్స్ బుక్ ఫెయిర్ 2025.. రియాద్ పెవిలియన్ ప్రారంభం..!!

బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 2025 ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు జరగనున్న 49వ బ్యూనస్ ఎయిర్స్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో రియాద్ పెవిలియన్‌ను ప్రారంభం అయింది. లాటిన్ అమెరికాలో సౌదీ అరేబియా సాంస్కృతిక ఉనికిని బలోపేతం చేయడం, సౌదీ విజన్ 2030 యొక్క పరివర్తనలను ప్రతిబింబించే ఆధునిక, భవిష్యత్తును చూసే రాజధాని నగరంగా రియాద్‌ను పరిచయం చేయడం రియాద్ పెవిలియన్ లక్ష్యం. సాంస్కృతిక బ్రిడ్జి నిర్మించడంలో సహాయపడటానికి స్పానిష్‌లోకి అనువదించబడిన రచనలతో సహా ఈ పెవిలియన్ విభిన్న సాహిత్య, సాంస్కృతిక విషయాలను కలిగిన ప్రచురణలను ఏర్పాటు చేశారు. సాహిత్య కమిషన్ CEO డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్-వాసిల్ మాట్లాడుతూ.. సౌదీ అరేబియా - అర్జెంటీనా మధ్య బలమైన సంబంధాలను హైలైట్ చేశారు. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి సాంస్కృతిక సహకారం ప్రాముఖ్యతను వివరించారు. రియాద్‌ను గౌరవ అతిథిగా ఎంచుకోవడం వల్ల ప్రజల మధ్య సాంస్కృతిక సంభాషణకు అవకాశాలు పెరుగుతాయని అర్జెంటీనా బుక్ ఫౌండేషన్ అధ్యక్షురాలు క్రిస్టీన్ రైనాన్ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com