మస్కట్‌లో మే 3న ఇరాన్-అమెరికా మూడో రౌండ్ చర్చలు..!!

- April 27, 2025 , by Maagulf
మస్కట్‌లో మే 3న ఇరాన్-అమెరికా మూడో రౌండ్ చర్చలు..!!

మస్కట్ : ఇరాన్, అమెరికా మధ్య శనివారం మస్కట్‌లో మూడో రౌండ్ ఉన్నత స్థాయి అణు చర్చలు ముగిశాయి. తదుపరి రౌండ్ చర్చల కోసం మే 3న రెండు వర్గాలు మళ్ళీ సమావేశం కావాలని నిర్ణయించాయి. సమావేశం తర్వాత, ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసైది మాట్లాడుతూ.. "శనివారం జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు పరస్పర గౌరవం, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఉమ్మడి ఆకాంక్షను గుర్తించాయి. ప్రధాన సూత్రాలు, లక్ష్యాలు,ఆందోళనలన్నీ పరిష్కరించబడ్డాయి. మే 3న తాత్కాలికంగా జరగనున్న మరో ఉన్నత స్థాయి సమావేశంతో వచ్చే వారం చర్చలు కొనసాగుతాయి." అని అన్నారు.
ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసైది సమక్షంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ చర్చలలో పాల్గొన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం, టెహ్రాన్‌పై ఆంక్షల తొలగింపుపై ఒక ఒప్పందానికి రావడానికి ఇరాన్, అమెరికా గత రెండు వారాల్లో ఒమన్, ఇటలీలో రెండు రౌండ్ల చర్చలు జరిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com