కశ్మీర్లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేత
- April 29, 2025
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ క్రియాశీలం కావడంతో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న 87 పర్యాటక ప్రదేశాల్లోని 48 ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. ఈ నెల 22న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రాబోయే రోజుల్లో భద్రతా దళాలు, స్థానికేతర వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు చురుగ్గా ప్రణాళికలు రచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు, నిఘా సంస్థల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. స్థానికేతర వ్యక్తులు, సీఐడీ సిబ్బంది, కాశ్మీర్ పండిట్లపై శ్రీనగర్, గుండేర్బల్ జిల్లాల్లో దాడులు చేయాలని పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రణాళికలు రచిస్తున్నట్టు కూడా నిఘా వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడి తర్వాత లోయలో ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా ఉత్తర, మధ్య, దక్షిణ కాశ్మీర్లో చురుగ్గా ఉన్న ఉగ్రవాదులు మరింత ప్రభావవంతమైన దాడికి ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాల నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే, రైల్వేలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని నివేదిక హెచ్చరించింది. రైల్వే సెక్యూరిటీ సిబ్బంది బయటకు రాకుండా తమకు కేటాయించిన బ్యారక్లు, క్యాంపుల్లోనే ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!







