సౌదీ అరేబియాలో సినిమాకు ఆదరణ.. SR845.6 మిలియన్ల ఆదాయం..!!

- May 01, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో సినిమాకు ఆదరణ.. SR845.6 మిలియన్ల ఆదాయం..!!

రియాద్: 2024లో సౌదీ అరేబియాలోని సినిమా రంగం నుండి వచ్చిన మొత్తం ఆదాయం SR845.6 మిలియన్లు ($225.42 మిలియన్లు) వచ్చింది. ఈ మేరకు సౌదీ ఫిల్మ్ కమిషన్ వార్షిక నివేదికను విడుదల చేసింది.మొత్తంగా సౌదీలో ప్రదర్శించబడిన చిత్రాల సంఖ్య 504కి చేరుకోగా, వీటిలో 17 సౌదీ చిత్రాలు ఉన్నాయి. అయితే, అంతకుముందు సంవత్సాలతో చూసుకుంటే ఆదాయాలు కొద్దిగా తగ్గాయని నివేదికలో తెలిపారు.  2022లో SR937 మిలియన్లు రాగా, 2023లో SR922 మిలియన్ల ఆదాయం వచ్చింది. సుమారు 17.5 మిలియన్ టిక్కెట్లు సేల్ కాగా, సగటు టికెట్ ధర SR48.2గా ఉందని నివేదికలో పేర్కొన్నారు.    ఏప్రిల్ 2024లో టిక్కెట్ల ధరలను $17 నుండి $14కి తగ్గించినప్పటికీ, సినిమా ప్రదర్శనలు పెరగడంతో బ్యాలెన్స్ అయిందని తెలిపారు.

సౌదీ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల విషయానికొస్తే.. అమెరికన్ యాక్షన్ కామెడీ చిత్రం "బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై" సుమారు 1.7 మిలియన్ టిక్కెట్ల సేల్ తో SR88.1 మిలియన్ల ఆదాయంతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత వెలాడ్ రిజ్క్ 3 SR39.9 మిలియన్లు, ఆ తర్వాత టాక్సిక్ మ్యారేజ్ SR29.8 మిలియన్లు వసూలు చేసింది, ఇన్‌సైడ్ అవుట్ 2 SR29.2 మిలియన్లు వసూలు చేసింది.

స్థానిక నిర్మాణం పరంగా, సౌదీ సినిమాలు మొత్తం SR76.6 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించాయి. సుమారు 1.8 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాలలో "మందోబ్ ఎల్ లీల్ (ది నైట్ రిప్రజెంటేటివ్)" ఒకటి. ఇది 2024లో రాజ్యంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. 620,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడు పోగా.. 28.6 సౌదీ రియాల్స్ వసూలు చేసింది. ఈ చిత్రం మొదటి రోజున $1.6 మిలియన్ల ఆదాయంతో బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలిచింది. 632,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైన 'షబాబ్ అల్-బాంబ్', 26.6 మిలియన్ల సౌదీ రియాల్స్ ఆదాయాన్ని ఆర్జించి రెండవ స్థానంలో నిలిచింది. ఈజిప్షియన్ రొమాంటిక్ కామెడీ బహెబెక్ మూడవ స్థానంలో నిలిచింది.

రికార్డుల ప్రకారం.. అమెరికన్ సినిమాలు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. 180 చిత్రాలలో మొత్తం ఆదాయంలో 58.5 శాతం, తరువాత 45 చిత్రాలలో 25.1 శాతంతో ఈజిప్షియన్ సినిమాలు ఉన్నాయి. సౌదీ సినిమాలు 17 చిత్రాలతో 7.8 శాతం, భారతీయ సినిమాలు 109 చిత్రాలలో 3.97 శాతంతో ఉన్నాయి. మిగిలిన పరిమిత వాటాను జపనీస్, బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్ సినిమాలు వరుసగా ఉన్నాయి.  ఏడు సినిమా ఆపరేటర్ల ద్వారా రాజ్యంలోని 10 ప్రాంతాలలో విస్తరించి ఉన్న 630 స్క్రీన్‌లతో కూడిన 64 సినిమాహాళ్ల నెట్‌వర్క్‌ వివరాలను పరిగణనలోకి తీసుకొని నివేదికను రూపొందించారు.

ఇక సిటీస్ పరంగా చూస్తే.. రియాద్ మొదటి స్థానంలో నిలిచింది, SR391.1 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. 7.4 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మక్కా SR224.5 మిలియన్ల ఆదాయంతో రెండవ స్థానంలో నిలిచింది. సుమారు 4.8 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తూర్పు ప్రావిన్స్ SR128.1 మిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2.9 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మదీనా SR28.8 మిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అసిర్‌లో SR 23.5 మిలియన్లు, ఖాసిమ్‌లో SR 19.2 మిలియన్ల ఆదాయం వచ్చింది. జజాన్ SR11 మిలియన్లు, తబుక్ SR9.5 మిలియన్లు, హెయిల్ SR7.6 మిలియన్ల ఆదాయంతో చివరి స్థానంలో నిలిచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com