22 న విడుదల కానున్న 'జక్కన్న' సినిమా
- July 08, 2016
సునీల్, మన్నారా చోప్రా జంటగా రూపుదిద్దుకున్న 'జక్కన్న' చిత్రాన్ని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. హీరో సునీల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. అందరికీ వినోదం పంచడం కోసం జులై 22న వస్తున్నట్లు ట్వీట్ చేశారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతం సమకూర్చారు. ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎందుకూ పనికిరాడు అనిపించుకున్న ఓ యువకుడు తనని తాను శిల్పంలా తీర్చిదిద్దుకొన్న వైనం ఎలాంటిదనే కథతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇటీవల నిర్మాత తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







