తెలివైన పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి
- July 08, 2016
ప్రతి మహిళా తల్లి కావాలని ఎలా ఆరాటపడుతుందో పుట్టే పిల్లలు తెలివైన వారై ఉండాలని అనుకుంటుంది. తెలివైన పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి అనే అంశంపై పరిశోధకులు చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గర్భధారణ సమయంలో పండ్లు అధికంగా తినే మహిళలు తెలివైన పిల్లలకు జన్మనిస్తున్నారని వెల్లడైంది. మహిళలు గర్భధారణ టైంలో ఎక్కువగా పండ్లు తింటే వాళ్లకు పుట్టే పిల్లల్లో మేధస్సు త్వరగా వృద్ధి చెందుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడాలోని ఆల్బెర్టా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 800మంది చిన్నారులను పరిశీలించారు. అంతేగాక వీరి కుటుంబ ఆదాయం, తల్లిదండ్రుల చదువు వంటి అంశాలను కూడా వీరు నమోదు చేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని ఐక్యూని గణించారు. సగటున 100పాయింట్లు నిర్ధారించగా 65శాతం మంది పిల్లలు 85 నుంచి 115 ఐక్యూ కలిగి ఉన్నారని తేలింది. రోజుకి ఆరు లేదా ఏడుసార్లు పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకున్న గర్భిణులకు పుట్టిన పిల్లలు 6 నుంచి ఏడు పాయింట్లు అధికంగా సాధించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







