ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర బిక్‌ లాంగ్వేజ్‌ కోర్సు..

- July 08, 2016 , by Maagulf
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర బిక్‌ లాంగ్వేజ్‌ కోర్సు..

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర బిక్‌ లాంగ్వేజ్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ సెల్‌ కో-ఆర్డినేటర్‌ ఆచార్య వీ చంద్రశేఖరరావు తెలిపారు. విశ్వవిద్యాలయ డైక్‌మెన ఆడిటోరియంలో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమానికి వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, గుంటూరు ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మొహమ్మద్‌ ముస్తఫా పాల్గొంటారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com