Dh180,000 విషయంలో వివాదం..వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఇద్దరు అరెస్ట్..!!

- May 04, 2025 , by Maagulf
Dh180,000 విషయంలో వివాదం..వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఇద్దరు అరెస్ట్..!!

యూఏఈ: 180,000 దిర్హామ్‌ల విషయంలో తన ఇద్దరు స్నేహితులతో జరిగిన తీవ్ర వివాదం తర్వాత ఒక చైనా వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Z.H.S. గా గుర్తించబడిన 40 ఏళ్ల బాధితుడు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) లోని ఒక టవర్ 36 వ అంతస్తులోని తన అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురయ్యాడు. అక్కడ అతను మరొక ఆసియా దేశానికి చెందిన తన భార్యతో కలిసి ఉంటున్నాడు.

పోలీసు రికార్డుల ప్రకారం..బాధితుడు తన ఇద్దరు స్నేహితులను తన అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. డబ్బు విషయంలో ముగ్గురు వ్యక్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అనంతరం తన భర్త కేకలు విన్నానని, గదికి పరిగెత్తానని, అతను ఛాతీపై కత్తిపోటుతో రక్తపు మడుగులో పడి ఉన్నాడని అతడి భార్య చెప్పింది. కొద్దిసేపటికే దుబాయ్ పోలీసులు, పారామెడిక్స్, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాధితుడు సంఘటనా స్థలంలోనే మరణించాడని ప్రకటించారు.  

అనుమానితులలో ఒకరిని అపార్టుమెంట్ మెట్ల దారిలో,  రెండవ నిందితుడిని సమీపంలో తన కారులో పారిపోతుండగా అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు నేరం అంగీకరించారు. మొదటి నిందితుడి నుండి Dh145,000, రెండవ నిందితుడి నుండి Dh35,000 మృతుడు అప్పుగా తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన సమయంలో గొడవ జరిగిందని నిందితులు తెలిపారు.  అయితే, నిందితులు అంతకుముందే అపార్టుమెంట్ సమీపంలోని కిరాణా దుకాణం నుండి రెండు కత్తులు కొనుగోలు చేశారని, అతనితో గొడవ పడాలని ముందే ప్లాన్ చేశారనిని పోలీసులు తెలిపారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపారు. ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతోంది. త్వరలోనే తీర్పు వెలువరించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com