శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డితో శంకర నేత్రాలయ USA ఆత్మీయ సమావేశం
- May 05, 2025
అమెరికా: శంకరనేత్రాలయ USA 1988 జూన్లో రాక్విల్, మేరీల్యాండ్, USA లో స్థాపించబడి, ఒక అత్యుత్తమ 501(C) (3) లాభాపేక్ష లేని సంస్థ గా కార్యకలాపాలు కొనసాగిస్తోంది.దీని ఏకైక లక్ష్యం అమెరికాలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిధులను సేకరించి భారతదేశంలోని శంకర నేత్రాలయ (చెన్నై)సంస్థ సేవా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం. శంకర నేత్రాలయ సంస్థ సలభై ఏడేండ్ల క్రితంఅప్పటి కంచి కామకోటి పీఠాధిపతి పిలుపుతో, డా.ఎసెస్ బద్రీనాథ్ ఆధ్వర్యంలో స్థాపించబడి, భారత ఉపఖండంలోనిరుపేద రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలైన ఉచిత కంటి చూపును అందించడానికి అంకితభావంతో పనిచేస్తున్న సమగ్రనేత్ర సంరక్షణ కేంద్రం.
మార్చి30న అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, మరియు శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కె.ఐ వరప్రసాద్ రెడ్డితో ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశం శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి,పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు,డా.కిషోర్ రసమల్లు, మరియు రాజేష్ తడికమల్లల మధ్య, సుమధురసంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనాల సాక్షిగా ఒక అపూర్వ సంగమం అనిచెప్పుకోవచ్చు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ యుఎస్సే సంస్థ ఎదుగుదల, మరియు వేగవంతంగా నిర్వహిస్తున్నమేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇది అతని గత విరాళం రూ.25 లక్షల కు తోడు, మొత్తం రూ.50 లక్షలు శంకర నేత్రాలయ USA కు అందించారని, ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సమానమైనసహాయం అని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు.అంతే గాకా 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా.వరప్రసాద్ రెడ్డి తమ అంకితభావాన్ని ప్రకటించడం ఆనందదాయకం.
తనUSA ప్రయాణంలోని ఒక భాగంగా, డా.వరప్రసాద్ రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు.ఆయన మిత్రుడు ప్రకాశ్ బేడపూడి—CTO మరియు EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ఆహ్వానం మేరకు.ప్రకాశ్ తమ స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.వరప్రసాద్ రెడ్డి జీవిత సత్యాలు, సందేశాలు, వారు ప్రసాదించిన సంగీత‘వీనుల విందుల”మధ్య, ఆత్మీయుల ముచ్చట్లతో నిండిన ఆ సాయంత్రం చిరస్మరణీయం.డాలస్ నివాసి,శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా.రెడ్డి (NRU) ఊరిమిండి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యి, సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు.ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్లవిరాళాన్ని ప్రకటించారు.అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చింది.బాలరెడ్ది ఇందుర్తి, డాక్టర్ వరప్రసాద్ రెడ్డి,ప్రకాశ్ బేడపూడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రెండు ఆత్మీయ సమావేశాలు మంచి అనుభూతిని మిగిల్చాయని సంస్థ సభ్యులతో పంచుకొన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!