బహ్రెయిన్ లో కొత్త చట్టం.. ప్రవాస ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల సంఖ్యపై నియంత్రణ..!!

- May 05, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో కొత్త చట్టం.. ప్రవాస ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల సంఖ్యపై నియంత్రణ..!!

మనామా: బహ్రెయిన్ లో కీలకమైన రెండు ముసాయిదా చట్టాలు షురా కౌన్సిల్ ముందుకు రానున్నాయి.ఒకటి ప్రైవేట్ పాఠశాలల్లో బోధనా ఉద్యోగాలలోకి ఎక్కువ మంది బహ్రెయిన్‌లను ప్రోత్సహించడం, మరొకటి సివిల్ సొసైటీల నిధులను సురక్షితమైన పెట్టుబడులలోకి పెట్టడానికి అనుమతించడం.

మొదటిది ప్రైవేట్ పాఠశాలలు, శిక్షణా కేంద్రాలు నియామకం చేసేటప్పుడు అర్హత కలిగిన బహ్రెయిన్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతున్నందున ఈమేరకు చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులు పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రైవేట్ స్కూల్స్ బహ్రెయిన్ లకు ప్రాధాన్యత  ఇచ్చేలా,  విధానంలో ఇప్పటికే ఉన్న నియామక పద్ధతులకు చట్టపరమైన సవరణలను తీసుకురావడమే లక్ష్యమని సర్వీసెస్ కమిటీ తెలిపింది. అయితే, ప్రస్తుతానికి అటువంటి ప్రయత్నాలు మంత్రివర్గ నియమాలపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు.  

అయితే, ప్రైవేట్ స్కూల్స్, సంస్థలు ఇప్పటికీ నియామకంపై పూర్తి హక్కును కలిగి ఉన్నాయి. కానీ అర్హత కలిగిన బహ్రెయిన్‌లకు అనుకూలంగా తమ ఎంపిక ప్రాధాన్యతలను ఇకపై మార్చుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.   

ప్రస్తుతం, 1989 నాటి డిక్రీ-లా నంబర్ 21లోని ఆర్టికల్ 18 ప్రకారం.. సివిల్ సొసైటీలు తమ వద్ద ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టకుండా నిరోధిస్తుంది. ఈ విధానం చాలా కఠినంగా మారిందని, సురక్షితమైన తక్కువ రాబడి ఉన్న పెట్టుబడులలో కూడా పౌర సమాజాలు మిగులు నిధులను ఉపయోగించుకోలేకపోతున్నాయని కమిటీ పేర్కొంది. ప్రతిపాదిత చట్టం ఇప్పటికీ అధిక-రిస్క్ లావాదేవీలను నిషేధిస్తుంది.  కానీ బహ్రెయిన్‌లో ఉండి, రోజువారీ కార్యకలాపాలకు అవసరం లేని డబ్బును మాత్రమే కలిగి ఉన్నంత వరకు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడానికి వీలుగా కొత్త చట్టం అనుమతిస్తుందని ప్రతిపాదనల్లో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com