తిరుమలలో టిటిడి బోర్డు సమావేశం

- May 07, 2025 , by Maagulf
తిరుమలలో టిటిడి బోర్డు సమావేశం

తిరుమల: ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆధ్యాత్మిక పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్.నాయుడు వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది.

ఇది వరకే తిరుప‌తి రూర‌ల్ మండ‌లం పేరూరు గ్రామంలోని స‌ర్వే నెం.604లో ఆంధ్ర ప్ర‌దేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కు చెందిన 24.68 ఎక‌రాల భూమిని టీటీడీకి బ‌ద‌లాయించాలని గతంలో టిటిడి బోర్డు నిర్ణయం తీసుకోవడమైనది. ఆ స్థలానికి బ‌దులుగా తిరుప‌తి అర్భన్ స‌ర్వే నెం.588-ఏ లో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎక‌రాల స్థ‌లాన్ని ఏపీటీఏ బదలాయింపునకు టిటిడి బోర్డు ఆమోదం తెల్పడమైనది.

అదేవిధంగా తిరుప‌తి రూర‌ల్ లోని సర్వే నెం.604లోని ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎక‌రాల స్థ‌లాన్ని టీటీడీకి బ‌ద‌లాయించ‌డం, దానికి బ‌దులుగా తిరుపతి అర్బన్ లోని స‌ర్వే నెంబ‌ర్ 588-ఏ లోని టీటీడీకి చెందిన 10.32 ఎక‌రాల స్థ‌లాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టిటిడి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com