హైదరాబాద్: 50 ఏళ్ల తర్వాత సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్
- May 07, 2025
హైదరాబాద్: పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ… ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలంతా ఎతమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే విషయంలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశ వ్యాప్తంగా నేడు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట చేపట్టిన ఈ మాక్ డ్రిల్ సాయంత్రం 4 గంటల నుంచి ఆరగంట పాటు జరిపారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ మాక్ డ్రిల్ ను దేశంలో చేపట్టారు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ మాక్ డ్రిల్ సైరన్ మోగింది. 1971లో ఇండియా-పాక్ యుద్ధ సమయంలో ఒకసారి మాక్ డ్రిల్ సైరన్ మోగింది. దేశ వ్యాప్తంగా మొత్తం 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరగడం విశేషం..
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్, విశాఖపట్నంలో మాల్ డ్రిల్ జరిపారు. హైదరాబాద్ లో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్, డీఆర్డీవో, మౌలాలిలో, విశాఖలో రెండు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు.
హైదరాబాద్ లో…..
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణలో బుధవారం మాక్ డ్రిల్ ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రెండు నిమిషాలపాటు సరైన్ మోగించారు. హైదరాబాద్ లో మాక్ డ్రిల్ సైరన్ మోగడంతో డిఫెన్స్ బృందం మాక్ డ్రిల్ ప్రారంభించింది. యుద్ధం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నాలుగు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగనట్లు మాక్ డ్రిల్ చేశారు. దాడుల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గాయపడిన వారికి అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించడం, ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు రక్షించే విధానం అవగాహన కల్పించారు.
మాక్ డ్రిల్ తిలకించేందుకు మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలకు పెద్ద ఎత్తున్న ప్రజలు చేరుకున్నారు. ఈ మాక్ డ్రిల్‌ను పోలీసులు, డిఫెన్స్ సంయుక్తంగా నిర్వహించాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎస్సీ తదితర ప్రాంతాల్లో డ్రిల్ ప్రారంభించారు. కంట్రోల్ కమాండ్ రూమ్ నుంచి పోలీసులు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. అనంతరం పోలీసు కంట్రోల్ కమాండ్ రూమ్ నుంచి సీపీ సి.వి.ఆనంద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. నాలుగు చోట్లు వైమానిక దాడులు జరిగే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!