మరోసారి యాక్షన్ మోడ్ లోకి సందీప్ కిషన్
- May 07, 2025
దశాబ్దంకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటి వరకూ పెద్ద బ్రేక్ తెచ్చుకోలేకపోయాడు సందీప్ కిషన్. తెలుగులోనే కాక తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు. కానీ ఎక్కడా స్టార్డమ్ తెచ్చుకోలేదు. అందుకు కారణాలేవైనా అతని టాలెంట్ పై మాత్రం ఎప్పుడూ కంప్లైంట్స్ రాలేదు. ప్రతిభావంతుడే కానీ.. పరాజయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమస్య. తెలుగులో చివరగా చేసిన మజాకా పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఆ నమ్మకం బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. మరో ఫ్లాప్ ఖాతాలో పడింది. ప్రస్తుతం తమిళ్ లో ఓ మూవీ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమిళ్ టాప్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడు కావడం విశేషం. ఇవాళ (బుధవారం) సందీప్ కిషన్ బర్త్ డే. ఈ సందర్భంగా జాసన్ సంజయ్ మూవీ నుంచి ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చూస్తే అతను మరోసారి యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయాడని తెలుస్తుంది. దర్శకుడుగా సంజయ్ కి ఇది ఫస్ట్ మూవీ అయినా ఈ వీడియో చూస్తే చాలా గ్రాండ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడని అర్థం అవుతోంది. ఈ సారి సందీప్ కిషన్ టార్గెట్ మిస్ కాడేమో అనిపిస్తుంది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న చిత్రం ఇది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర కాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ను టీమ్ ఇంకా వెల్లడించలేదు. మొత్తంగా బర్త్ డే స్పెషల్ గా సందీప్ కిషన్ ను పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నాను అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు జాసన్ సంజయ్
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!