జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం..
- May 08, 2025
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం అయ్యారు. భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు అజార్ స్థావరం సైతం ధ్వంసం అయింది. కందహార్‌లో IC-814 ఫైట్‌ను హైజాక్ చేయడంలో అబ్దుల్ రవూఫ్ అజార్ పాత్ర పోషించారు. అంతర్జాతీయ జిహాదీ నెట్ వర్క్‌లలోనూ అజార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. వారిలో అబ్దుల్ రవూఫ్ అజార్ ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. జైషేను స్థాపించిన మసూద్ అజార్ సోదరుడే అబ్దుల్ రవూఫ్ అజార్. జమ్మూకాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో అజార్ కీలకంగా ఉండటంతో మోస్ట్ వాంటెడ్‌గా మారారు.
పాకిస్థాన్ బహవల్ పూర్‌లో జైషే కార్యాలయంపై భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందగా.. అబ్దుల్ రవూఫ్ అజార్ గాయపడ్డారు. చికిత్స పొందుతూ గురువారం అజార్ కన్నుమూసినట్లు తెలుస్తోంది.
కాగా పహల్గాం ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో బుధవారం ఉగ్రస్థావరాలపై బాంబులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 9 శిబిరాలు ధ్వంసం అయ్యాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఆపరేషన్ సింధూర్ గురువారం కూడా కొనసాగింది. దీంతో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!