హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు షురూ..
- May 10, 2025
హైదరాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ 72 ఎడిషన్ పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. తెలంగాణ కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ప్రారంభోత్సవం జరిగింది.
మిస్ వరల్డ్ ప్రారంభోత్సవంలో తమ దేశాల సంస్కృతి, సాంప్రదాయ వేషధారణలతో ఆయా దేశాల కంటెస్టర్లు అలరించారు. 110కిపైగా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఇండియా తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తోంది. మిస్ ఇండియా నందిని గుప్తా వచ్చినపుడు కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమోగింది. ఇవాళ 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన చేశారు. మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







