నిద్రపోయే ముందు ఇవి ఒక్క రెండు తింటే ఆరోగ్య సమస్యలు దూరం
- May 12, 2025
పండ్లు అనగానే అరటిపండ్లు, ఆపిల్స్, ద్రాక్ష ఇలాంటి పండ్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ, మనం ఎక్కువగా తీసుకోని పండ్లు మన ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. అలాంటివాటిలో కివీ ఒకటి. వీటిని తీసుకుంటే ఏయే లాభాలుంటాయో తెలుసుకోండి.
ఇది వరకటి రోజుల్లో కివీ పండ్లు ఎక్కడో ఒక చోట మాత్రమే దొరికేవి. కానీ, ప్రజెంట్ సూపర్ మార్కెట్స్, ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్ ఇలా ఎక్కడైనా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు పడుకునేటప్పుడు తీసుకోవడం అది కూడా 4 వారాల పాటు తీసుకుంటే ఎక్కడలేనన్నీ లాభాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.
కివీని మిరాకిల్ స్లీప్ ఫ్రూట్ అని చెబుతుంటారు. ఎందుకంటే, వీటిలో నిద్రకి హెల్ప్ చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా సెరోటోనిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల మానసిక స్థితి మెరుగ్గా మారి రిలాక్స్‌గా ఫీల్ అవుతారు.అదే విధంగా, ఈ పండు తింటే నిద్రకి హెల్ప్ చేసే మెలటోనిన్ కూడా అందుతుంది.
కివీ పండ్లల కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. బాడీలో ఫ్యాట్ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. అయితే, ఈ పండ్లు తినడం వల్ల ఫ్యాట్ వల్ల వచ్చే సమస్యల్ని దూరం చేయొచ్చు. దీంతో పాటు ఇన్‌ఫ్లమేషన్‌ని కూడా తగ్గించొచ్చు.
కివీ పండ్లలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని వల్ల రక్తప్రవాహంలో నెమ్మదిగా చక్కెర విడుదలవుతుంది. ఈ కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. వీటిని తినడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ తగ్గి అతిగా తినడం వంటి సమస్యలు దూరమవుతాయి. ఆకలి తగ్గుతుంది.
కివీ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో ఎవరైతే కేలరీలు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫ్రూట్. అంతేకాకుండా, దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలాసేపటి వరకూ కడుపు నిండుగా ఉంటుంది. దీంతో జంక్ ఫుడ్ తినరు. బరువు కూడా ఈజీగా తగ్గుతారు.
ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా జీర్ణ సమస్యలైన కడుపు నొప్పి, మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ సమస్యలు రావు. ఇందులో సోల్యూబుల్, ఇన్‌సోల్యూబుల్ ఫైబర్ జీర్ణ సమస్యల్ని దరిచేరనివ్వదు.
నిద్రలేమితో బాధపడేవారు వీటిని తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగ్గా మారుతుంది. హాయిగా నిద్రపోతారు. కివీలోని విటమిన్ సి, పాలీఫెనాల్స్, ఆక్సీకరణ ఒత్తిడి, వాపుని తగ్గించి నిద్రలేమి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..