గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!

- January 08, 2026 , by Maagulf
గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!

కైరో: ఈజిప్ట్‌ లో పర్యటిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఈజిప్షియన్ నాగరికతను ప్రతిబింబించే అరుదైన పురావస్తు సేకరణలను వీక్షించారు. తన పర్యటనలో ఆయన రెండవ రామెసెస్ రాజు విగ్రహం, ప్రసిద్ధ తూతన్‌ఖామున్ రాజు సేకరణలతోపాటు అనేక ప్రముఖ కళాఖండాలను వీక్షించారు.

ఈజిప్ట్ చారిత్రక వారసత్వాన్ని చక్కగా సేకరించి, ప్రదర్శించారని మ్యూజియం సిబ్బందిని సయ్యద్ బదర్ ప్రశంసించారు. రెండు సోదర దేశాల మధ్య నాగరిక ఏకీకరణ మరియు జ్ఞాన మార్పిడికి మద్దతు ఇచ్చే విధంగా సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com