నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!

- January 08, 2026 , by Maagulf
నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!

కువైట్: కువైట్ బ్యాంకులు నాన్ కువైటీల కోసం రుణ నిబంధనలను సడలించాయి. సంవత్సరాల తరబడి కఠినమైన ఆంక్షల తర్వాత బ్యాంకులు ఆర్థికంగా అర్హత ఉన్న రెసిడెన్సీ రుణ గ్రహీతలను, ముఖ్యంగా వృత్తి నిపుణులు, అధిక ఆదాయ వర్గాల వారిని ఆకర్షించడానికి తమ రుణ విధానాలను సవరించాయి.  ఇప్పుడు బ్యాంకులు KD 3,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే నివాసితులకు KD 70,000 వరకు రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

అదే సమయంలో కువైట్ సెంట్రల్ బ్యాంక్ నిబంధనలకు లోబడి KD 1,500 మరియు KD 600 నుండి జీతాలు ఉన్నవారికి కూడా రుణాలు అందుబాటులో ఉన్నాయి. నెలవారీ వాయిదాలు రుణగ్రహీత జీతంలో 40 శాతానికి మించకూడదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.

కువైట్ సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. అర్హత గల వర్గాలలో డాక్టర్లు, నర్సులు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు వ్యాపారులు ఉన్నారు.  ఆయా వర్గాల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఏడు సంవత్సరాల వరకు కాలపరిమితితో KD 70,000 వరకు ఆర్థిక రుణాలను పొందే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com