సౌదీ అరేబియాలో టాప్ ఇన్వెస్టర్లు.. $15.4 బిలియన్లతో 6వ స్థానంలో యూఎస్..!!
- May 14, 2025
రియాద్: సౌదీ పెట్టుబడి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2024 చివరి నాటికి సౌదీ అరేబియాలో పెట్టుబడి పెట్టే అగ్ర దేశాలలో యునైటెడ్ స్టేట్స్ ఆరవ స్థానంలో ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) మొత్తం $15.4 బిలియన్లుగా ఉంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ $40.5 బిలియన్ల పెట్టుబడులతో అగ్రస్థానంలో ఉండగా, తరువాత లక్సెంబర్గ్ ($27.1 బిలియన్), ఫ్రాన్స్ ($17.4 బిలియన్), నెదర్లాండ్స్ ($17.1 బిలియన్) , యునైటెడ్ కింగ్డమ్ ($16.7 బిలియన్) ఉన్నాయి. మిగిలిన టాప్ పది పెట్టుబడిదారులలో బహ్రెయిన్ ($10 బిలియన్), కువైట్ ($9.5 బిలియన్), జోర్డాన్ ($6.8 బిలియన్), జపాన్ ($6.3 బిలియన్) ఉన్నాయి.
పెట్టుబడి వాతావరణం, ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో సౌదీ అరేబియా విజన్ 2030 కింద కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలకు బలమైన FDI రాక కారణమని పేర్కొన్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ మధ్య వాణిజ్యం కూడా బలంగా ఉందని, 2024లోయూఎస్ కి సౌదీ ఎగుమతులు $13 బిలియన్లకు చేరుకున్నాయని, అదే సమయంలో యూఎస్ నుండి దిగుమతులు $19 బిలియన్లుగా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. సౌదీ అరేబియా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల మధ్య వాణిజ్య పరిమాణం 2024లో $180 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!