ముగ్గురు ఆసియన్ల ప్రాణాలను కాపాడిన యూఏఈ నేషనల్ గార్డ్స్..!!

- May 18, 2025 , by Maagulf
ముగ్గురు ఆసియన్ల ప్రాణాలను కాపాడిన యూఏఈ నేషనల్ గార్డ్స్..!!

యూఏఈ: యూఏఈ సముద్ర  జలాల్లో మునిగిపోతున్న కార్గో షిప్ నుండి ఆదివారం ఆ దేశ నేషనల్ గార్డ్ ముగ్గురు వ్యక్తులను రక్షించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం తెలిపింది. నేషనల్ గార్డ్ కోస్ట్ గార్డ్ సహకారంతో నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడ్డ ఆసియా దేశాలకు చెందిన ఈ ముగ్గురినీ రెస్క్యూ బోట్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.  

గత నెలలో, సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైన ఓడ నుండి 10 మంది ఆసియా నావికులను యూఏఈ నేషనల్ గార్డ్ రక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com