వాణిజ్య సవాళ్లు ప్రపంచ ఆర్థిక సమైక్యతను దెబ్బతీయవు: QNB

- May 25, 2025 , by Maagulf
వాణిజ్య సవాళ్లు ప్రపంచ ఆర్థిక సమైక్యతను దెబ్బతీయవు: QNB

దోహా: వాణిజ్య సవాళ్లు ప్రపంచ ఆర్థిక ఏకీకరణను దెబ్బతీయవని, మార్కెట్ ఒత్తిళ్లు, చట్టపరమైన పరిమితులు, కార్పొరేట్ అనుకూలత, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు బహిరంగతకు నిరంతర నిబద్ధత ఇవన్నీ ప్రపంచీకరణ తిరగబడటం లేదని, భౌగోళికంగా పునర్నిర్మించబడటం, తిరిగి ఆధారితం కావడం జరుగుతుందని సూచిస్తున్నాయని ఖతార్ నేషనల్ బ్యాంక్ (QNB) తన వీక్లీ ప్రకటనలో తెలిపింది.

ఇటీవలి US టారిఫ్ చర్యల స్థాయి బాగున్నా..అనేక మినహాయింపుల ప్రకటనతర్వాత కూడా, ప్రపంచ ఆర్థిక ఏకీకరణకు మద్దతు ఇచ్చే శక్తులు బలంగా ఉన్నాయని పేర్కొంది. పెట్టుబడిదారులకు, అమెరికా సుంకాల పెంపుదల వాణిజ్య సరళీకరణకు విరామం ఇవ్వడమే అవుతుందని కొంతమంది విశ్లేషకులు తెలిపారు.యూఎస్ సుంకాల రేట్ల వల్ల అసాధారణ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక ఏకీకరణ ఇప్పటికే ఉన్న డీగ్లోబలైజేషన్ పట్ల అవగాహన పెట్టుకోవాలని సూచించారు.
మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యూరోపియన్ యూనియన్ (EU) నుండి ఆసియా, లాటిన్ అమెరికా వరకు, చాలా ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు అప్రమత్తంగా పరిస్తితులను అనుసరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com