మూడు వాహనాలను ఢీకొట్టి.. పారిపోయిన డ్రైవర్..షార్జాలో అరెస్ట్..!!

- May 25, 2025 , by Maagulf
మూడు వాహనాలను ఢీకొట్టి.. పారిపోయిన డ్రైవర్..షార్జాలో అరెస్ట్..!!

యూఏఈ: షార్జాలో 3 వాహనాలను ఢీకొట్టి పారిపోయిన ఒక వాహనదారుడిని ఆరు గంటల్లో ఎమిరేట్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ భయంకరమైన సంఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.

యూఏఈలో హిట్-అండ్-రన్ కేసులను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. కాగా, షార్జా విమానాశ్రయ రోడ్డులో ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను ట్రాక్ చేయడంలో స్మార్ట్ సిస్టమ్‌లు, నిఘా కెమెరా నెట్‌వర్క్‌లు సహాయపడ్డాయి. 

పోలీసులు షేర్ చేసిన 41 సెకన్ల నిడివి గల ఈ క్లిప్‌లో ఒక తెల్లటి పికప్ ట్రక్ అకస్మాత్తుగా హైవేపై లేన్‌లను దాటుతూ మరొక వాహనాన్ని ఢీకొట్టడం, ఆ తర్వాత అది మరిన్ని వాహనాలను ఢీకొట్టింది.  

"ఒకరి లేన్‌లో ఉండకపోవడం ట్రాఫిక్ ప్రమాదాలకు ప్రధాన కారణాలలో ఒకటి. దీనివల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాల కారణంగా తీవ్రమైన గాయాలు సంభవించవచ్చు. ముఖ్యంగా 120 కి.మీ/గం వేగం వరకు ఉన్న హైవేలపై ఇటువంటి ప్రవర్తన ప్రాణప్రాయం కావచ్చు." అని షార్జా పోలీసుల ట్రాఫిక్, పెట్రోల్ విభాగం డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్లా అలై అన్నారు.
మార్చి 29 నుండి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ నిబంధనలపై కొత్త ఫెడరల్ డిక్రీ చట్టం ప్రకారం.. డ్రైవర్ కు రెండు సంవత్సరాలకు మించకుండా జైలు శిక్ష, 50,000 దిర్హామ్‌లకు తక్కువ కాకుండా 100,000 దిర్హామ్‌లకు మించకుండా జరిమానా విధిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com