మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ బాసట..!!
- May 26, 2025
కువైట్: మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ అధికారికంగా KD 618,240 (సుమారు INR 17.31 కోట్లు) విలువైన గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను అందజేసింది. NBTC కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంబసీ, లులు ఎక్స్ఛేంజ్ గ్రూప్, NBTC మేనేజ్మెంట్ ప్రతినిధులు , ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కె. జి. అబ్రహం..మరణించిన 49 మంది ఉద్యోగుల చట్టపరమైన వారసులకు బీమా చెల్లింపులను అందజేశారు. బాధిత ఉద్యోగులకు 48 నెలల జీతానికి సమానమైన బీమా చెల్లింపును NBTC ఉద్యోగి సంక్షేమ పథకం కింద అందించారు. మిగిలిన ఉద్యోగుల కుటుంబాలను కలవడానికి NBTC మేనేజ్మెంట్ వచ్చే వారం భారతదేశానికి వెళ్లి అదనపు సహాయాన్ని అందిస్తుందని అబ్రహం ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త







