యూఏఈలో నాలుగు రోజులపాటు ఈద్ అల్ అధా సెలవులు..!!

- May 28, 2025 , by Maagulf
యూఏఈలో నాలుగు రోజులపాటు ఈద్ అల్ అధా సెలవులు..!!

యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం ఈద్ అల్ అధా సందర్భంగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి.  ఫెడరల్ అథారిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 9 దుల్ హిజ్జా నుండి 12 దుల్ హిజ్జా వరకు సెలవులను ప్రకటించారు.  అంటే, జూన్ 5 (గురువారం) నుండి జూన్ 8 (ఆదివారం) వరకు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సెలవులు ఉంటాయి.  జూన్ 9 (సోమవారం) ప్రభుత్వ కార్యాలయాలు పునర్ ప్రారంభం అవుతాయి. 

నెలవంక కన్పించడంతో  మే 28ని దుల్ హిజ్జా మొదటి రోజుగా ప్రకటించారు. ఈ క్రమంలో అరఫా దినం జూన్ 5 న వస్తుంది. ఈద్ అల్ అధా జూన్ 6 (శుక్రవారం) ప్రారంభమవుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com