ఇజ్రాయెల్ రాయబారిని సమన్లు జారీ చేసిన యూఏఈ..!!

- May 29, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ రాయబారిని సమన్లు జారీ చేసిన యూఏఈ..!!

యూఏఈ: అల్ అక్సా మసీదు, జెరూసలేం పాత నగరంలోని ఇస్లామిక్ క్వార్టర్ ప్రాంగణాల్లో పాలస్తీనియన్లపై జరిగిన దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది.ఈ నేపథ్యంలో యూఏఈలోని ఇజ్రాయెల్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పవిత్ర నగరం యొక్క పవిత్రతను తీవ్రంగా ఉల్లంఘించడమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. మత సామరస్యాన్ని , అంతర్జాతీయ శాంతికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించింది. గాజా స్ట్రిప్‌లో మానవతా సంక్షోభాన్ని ముగించడం ప్రాధాన్యతగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com