ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి ..
- May 30, 2025
న్యూ ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన లో ఉన్నారు. ఇక నేటి సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో జరగనున్న సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ), పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సీఐఐ సభ్యులకు ముఖ్యమంత్రి వివరించనున్నారు.ఈ కార్యక్రమం పూర్తి కాగానే ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు విజయవాడకు వస్తారు.ఈ రోజు రాత్రి 8.30 గంటలకు విజయవాడకు చేరుకుంటారు.ఇక్కడ పనులు పూర్తి చేసుకుని శనివారం రాజమండ్రి పర్యటనకు వెళతారు.
సీఎం చంద్రబాబు నాయుడు కడపలో మూడు రోజుల మహానాడు కార్యక్రమాలు ముగించుకుని గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో చంద్రబాబుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సానా సతీష్‌తో సహా పలువురు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు.విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాసం వన్‌జన్‌పథ్‌కు ముఖ్యమంత్రి వెళ్లారు.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







