CII సదస్సులో సీఎం చంద్రబాబు

- May 30, 2025 , by Maagulf
CII సదస్సులో సీఎం చంద్రబాబు

న్యూ ఢిల్లీ: సీఐఐ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లవద్దని కొందరు తనకు సూచించారని చంద్రబాబు చెప్పారు.దావోస్ లో పారిశ్రామికవేత్తలను కలిస్తే పేదలు ఓట్లు వేయరని వారు తనతో అన్నారని చంద్రబాబు తెలిపారు. ఆ సమయంలో ప్రధాని, కేంద్ర మంత్రులు కూడా దావోస్ వెళ్లలేదని చెప్పారు.

తాను మాత్రం తరుచూ దావోస్ వెళ్లి వస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. నేను మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నా అని అన్నారు. ఏపీ సీఎంగా సీఐఐ సదస్సులు నిర్వహించానన్నారు. సంపద సృష్టితోనే అభివృద్ధి సాధ్యం అన్నారు చంద్రబాబు. ఆదాయం పెరిగితే మరిన్ని సంక్షేమ పథకాలు అందించవచ్చన్నారు. సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్ కు పారిశ్రామికవేత్తలు సహకరించాలని చంద్రబాబు కోరారు. సీఐఐ సదస్సులో ఏపీలో పెట్టుబడుల అవకాశంపై పారిశ్రామికవేత్తలకు వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com