'శానిటరీ టూల్స్' మాటున భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్..!!

- May 31, 2025 , by Maagulf
\'శానిటరీ టూల్స్\' మాటున భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్..!!

రియాద్: అల్-బాతా సరిహద్దు క్రాసింగ్ ద్వారా 1,847,952 యాంఫేటమిన్ పిల్స్,  184,001 గ్రాముల మాదకద్రవ్యాల పదార్థాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) భగ్నం చేసింది. "శానిటరీ టూల్స్" అని లేబుల్ చేయబడిన షిప్‌మెంట్‌లో దాచిపెట్టి రవాణా చేసినట్లు ZATCA ప్రతినిధి హమౌద్ అల్-హర్బి వివరించారు.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌ సమన్వయంతో ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. భద్రతా హాట్‌లైన్ (1910), ఇమెయిల్ (zatca.gov.sa) లేదా అంతర్జాతీయ నంబర్ (+9661910) ద్వారా సంప్రదించడం ద్వారా అక్రమ రవాణా కార్యకలాపాలను నివేదించమని పిలుపునిచ్చారు. సరైన సమాచారం ఇచ్చేవారి వివరాలను పూర్తి గోప్యంగా పెడతామని, తగిన ఆర్థిక బహుమతులను అందజేస్తామని ప్రకటించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com