బహ్రెయిన్ లో జీరో టోలరెన్స్.. డ్రైవింగ్ నిర్లక్ష్యంపై ఇక కఠిన చర్యలు..!!

- June 01, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో జీరో టోలరెన్స్.. డ్రైవింగ్ నిర్లక్ష్యంపై ఇక కఠిన చర్యలు..!!

మనామా: రహదారులపై వాహనదారుల భద్రతకు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గాయలు, లేదా మరణానికి దారితీసే ట్రాఫిక్ ఉల్లంఘనలకు చట్టపరమైన శిక్షలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నిర్లక్ష్య ప్రవర్తనను నియంత్రించే లక్ష్యంతో కొత్త చట్టాన్ని రూపొందించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు.  ప్రజా భద్రత, సామాజిక శ్రేయస్సుకు నిరంతర ముప్పుగా భావించే వాటిని ఎదుర్కోవడానికి కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు. 

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత

రహదారుల భద్రత కేవలం నియంత్రణ సమస్య మాత్రమే కాదని, జాతీయ భద్రతకు మూలస్తంభమని చెప్పారు. అన్ని రహదారులు వాహనదారులకు సురక్షితమైన, స్థిరమైన ట్రాఫిక్ వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు.  అదే సమయంలో సామాజిక భద్రత,  శ్రేయస్సుకు మూలస్తంభంగా రహదారుల భద్రత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 

ప్రతిపాదిత చట్టాలు వేగంగా నడపడం, నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేయడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి అధిక-ప్రమాదకర ప్రవర్తనలకు కఠిన శిక్షలు వేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com