మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా మేఘా సుధా రెడ్డి

- June 01, 2025 , by Maagulf
మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా మేఘా సుధా రెడ్డి

హైదరాబాద్‌: మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్‌కు వచ్చిన సమయంలో హైదరాబాద్‌లోని హై ప్రోఫైల్ వర్గాల్లో ఎక్కడా లేనంత సందడి కనిపిస్తోంది. ధనవంతులు, ఫ్యాషన్ ప్రియులు అంతా హైటెక్స్ లోనే కొలువుదీరారు. అందరిలోనూ ప్రత్యేకంగా మేఘా సుధారెడ్డి నిలిచారు. ఆమెను మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా నియమించారు. ఈ నియామకం సందర్భంగా జ్ఞాపికను మిస్ వరల్డ్ సిఈఓ జూలియా మోర్లీ అందించారు. తనను నియమించినందుకు చాలా ఆనందంగా ఉందని సుధారెడ్డి అన్నారు. అద్భుతమైన ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

మేఘా సుధారెడ్డికి ఫ్యాషన్ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. మిస్ వరల్డ్ పోటీల విషయంలో ఆమె పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కొన్ని కార్యక్రమాలనూ నిర్వహించారు. తన ఇంట్లో ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ గాలా విందు కూడా ఇచ్చారు. ఈ విందుకు దేశంలోని రాజ కుటుంబాల ప్రతినిధులు హాజరయ్యారు. చాలా హై రేంజ్ లో ఈ పార్టీ జరిగింది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలకూ స్పాన్సర్ షిప్ ఇచ్చారు. అందుకే గ్లోబల్ అంబాసిడర్ గా నియమించారు.

గతంలో అమెరికాలో జరిగే మెట్ గాలా వేడుకల్లోనూ సీటు రిజర్వ్ చేసుకుని వెళ్లారు. ఆమె కోసం మేఘా కృష్ణారెడ్డి ప్రత్యేకమైన ఫ్యాషన్ కార్యక్రమాలకు స్పాన్సర్ చేస్తూంటారని ప్రచారం జరుగుతూ ఉంటుంది. మొత్తంగా మిస్ వరల్డ్ పోటీల విషయంలో మేఘా కృష్ణారెడ్డి కి ఖర్చు కాస్త ఎక్కువే అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు భార్యపై ఉన్న ప్రేమ ముందు ఈ ఖర్చు తక్కువేనని కొంత మంది అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com