షార్జా అగ్నిప్రమాదం..అల్ హమ్రియా ప్రమాదం పై దర్యాప్తు..!!
- June 02, 2025
షార్జా: షార్జాలోని అల్ హమ్రియా ఓడరేవులో కూలింగ్ కార్యకలాపాలను అధికారులు పూర్తి చేశారు.ఈ భారీ అగ్నిప్రమాదాన్ని అదుపు చేయడానికి 24 గంటలు పట్టింది. శనివారం ఉదయం 6.10 గంటలకు మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం 6.25 గంటలకు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని, అన్ని సాంకేతిక పరిశీలనల తర్వాత దర్యాప్తు ఫలితాలు ప్రకటించబడతాయి. ఇటీవలి సంవత్సరాలలో ఎమిరేట్‌లో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక అగ్నిప్రమాదాలలో ఒకటిగా ఈ అగ్నిప్రమాదాన్ని పేర్కొంటున్నారు. అత్యంత మండే గుణం కలిగిన పెట్రోకెమికల్ పదార్థాల వల్ల ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. అధికారులు వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
షార్జా సివిల్ డిఫెన్స్ ఫోమ్ ట్యాంకర్లు మరియు అధిక సామర్థ్యం గల నీటి పంపులతో సహా అధునాతన అగ్నిమాపక పరికరాలను మోహరించింది. షార్జా సివిల్ ఏవియేషన్ అథారిటీ, షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో హెలికాప్టర్లు, ఎయిర్ జెట్లను ఉపయోగించారు. షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ముబారక్ బిన్ అమెర్ ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారందరినీ అభినందించారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!







