అల్-రెగ్గైలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం...ఐదుకు పెరిగిన మృతుల సంఖ్య..!!
- June 02, 2025
కువైట్: ఆదివారం తెల్లవారుజామున రెగ్గై ప్రాంతంలో జరిగిన ఒక అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగిందని అధికారులు తెలిపారు.మృతులందరూ సూడాన్ జాతీయులుగా తెలుస్తుంది. కాగా, ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. షువైఖ్ ఇండస్ట్రియల్, అర్దియా సెంటర్ల నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.మొదటగా ఒక అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి, త్వరగా అవి పక్క ప్రాంతాలకు వ్యాపించాయి.ఈ ప్రమాదంపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, భవనంలో ఎక్కువ మంది అద్దెదారులు ఆఫ్రికన్, ఆసియా జాతీయులు.మరోవైపు, జనరల్ ఫైర్ ఫోర్స్ భవనాలు, ఇతర సౌకర్యాల యజమానులు అన్ని భద్రత, అగ్ని నిరోధక నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







