తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 'అవతరణ' వేడుకలు..

- June 02, 2025 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా \'అవతరణ\' వేడుకలు..

న్యూ ఢిల్లీ: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోందంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. తెలంగాణలో శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు పురోగతిలో మరింత ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

దేశ పురోగతికి ఎంతో కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం ఏన్డీఏ సర్కారు ఎన్నో చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇక్కడి ప్రజల మెరుగైన జీవన సౌలభ్యం కోసం కేంద్ర సర్కారు కృషిచేస్తోందని అన్నారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్ చేశారు. అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆ స్ఫూర్తిని రేవంత్ రెడ్డి సర్కారు కొనసాగించాలని అన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

తెలుగు రాష్ట్రాలు వేరైనప్పటికీ తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్ఆపరు.

కాగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సహా పలువురు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com