'100డేస్ ఆఫ్ లవ్' చిత్రం తెలుగు టీజర్ విడుదలైంది..
- July 12, 2016
దుల్కర్ సల్మాన్, నిత్యామేనన్ జంటగా నటించిన '100డేస్ ఆఫ్ లవ్' చిత్రం తెలుగు టీజర్ విడుదలైంది. ఇదివరకే మలయాళంలో విడుదల చేసిన ఈ చిత్రం అక్కడ విజయం సాధించింది. త్వరలో తెలుగులో అదే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈ నెల 13న చిత్రం ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. జీనస్ మహమ్మద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వెంకటరత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ ప్రేమజంట జీవితంలో వంద రోజులు ఎలా గడిచాయన్న విషయాన్ని ఈ చిత్రంలో చూపించామని నిర్మాత తెలిపారు. ఈ నెలాఖరుకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో తాను ఒక పాట పాడినట్లు నిత్యామేనన్ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







