ఈద్ అల్ అధా.. ఖతార్ లో హెల్త్ సెంటర్స్ పనివేళల్లో మార్పులు..!!
- June 04, 2025
దోహా, ఖతార్: ఈద్ అల్ అధా సెలవుల సందర్భంగా ప్రజారోగ్య రంగం పనివేళలను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) ఆసుపత్రులలోని అన్ని అత్యవసర సేవలు, ఇన్‌పేషెంట్ విభాగాలు, పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్లు, అలాగే అంబులెన్స్ సర్వీస్ కూడా 24/7 ఆన్-కాల్ ప్రాతిపదికన పనిచేస్తాయని తెలిపింది.
ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC)తో అనుబంధంగా ఉన్న 20 ఆరోగ్య కేంద్రాలు సెలవుదినం సందర్భంగా పనిచేస్తాయని, అల్ జుమైలియా హెల్త్ సెంటర్ 24/7 ఆన్-కాల్ ప్రాతిపదికన పనిచేస్తుందని తెలిపింది. PHCC 12 ఆరోగ్య కేంద్రాలలో 24 గంటలూ అత్యవసర సంరక్షణ సేవలను అందిస్తుందని, వీటిలో అత్యవసర పిల్లల కేసులకు సంబంధించిన ఆరు కేంద్రాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.
శుక్రవారాలు, శనివారాలు మినహా విదేశీ చికిత్స విభాగం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పనిచేయనుంది. అలాగే ఉమెన్స్ వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ (WWRC)లో ఉన్న జనన నమోదు కార్యాలయం.. ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పనిచేస్తుంది. మరణ నమోదు యూనిట్ కూడా ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పనిచేస్తుందని ప్రకటించారు. ఖతార్ హెల్త్ కేర్ యూనిఫైడ్ కాంటాక్ట్ సెంటర్ 16000 నెంబర్ నిరాంతరాయంగా పనిచేస్తూనే ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!