దుబాయ్‌లో సెలవు రోజుల్లో సాలిక్ వేరియబుల్ టోల్ రేట్ల అమలు..!!
- June 05, 2025
యూఏఈ: దుబాయ్ టోల్ ఆపరేటర్ అయిన సాలిక్ PJSC.. ఈద్ అల్ అధా సెలవు రోజుల్లో వేరియబుల్ రోడ్ టోల్ ధరలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 5 నుండి 8 వరకు (గురువారం నుండి ఆదివారం వరకు) ఉదయం 6 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య రద్దీ సమయాల్లో.. దుబాయ్ అంతటా ఉన్న 10 సాలిక్ గేట్లలో దేనినైనా వాహనం దాటిన ప్రతిసారీ Dh6 ఛార్జీ చేయనుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 8 నుండి తెల్లవారుజామున ఒంటిగంట వరకు (పీక్ అవర్స్ కాకుండా), టోల్ గేట్ ఛార్జ్ Dh4 గా ఉండనుంది. సాలిక్ తెల్లవారుజామున 1 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉచితంగా వెళ్లవచ్చు.
సాలిక్ వేరియబుల్ రోడ్ టోల్ ధర ఈ సంవత్సరం జనవరి 31న ప్రారంభమైంది. వారపు రోజులలో (సోమవారం నుండి శనివారం వరకు), ఉదయం రద్దీ సమయాల్లో (ఉదయం 6 నుండి 10 గంటల వరకు), సాయంత్రం రద్దీ సమయాల్లో (సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు) టోల్ ధర Dh6గా నిర్ణయించారు. ఆఫ్-పీక్ సమయాల్లో.. ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల మధ్య, రాత్రి 8 నుండి తెల్లవారుజాము 1 గంటల వరకు, టోల్ Dh4. సాలిక్ వారంలోని ఏడు రోజులు ఉదయం 1 నుండి ఉదయం 6 గంటల వరకు ఉచితం. ప్రభుత్వ సెలవు దినాలలో టోల్ గేట్లు ఉచితం కాదని, నియమిత షెడ్యూల్ ప్రకారం వేరియబుల్ టోల్ రేట్లకు లోబడి ఉంటాయని సలిక్ ఇంతకుముందు స్పష్టం చేసింది.
ఉచిత పార్కింగ్
ఈద్ అల్ అధా, దుబాయ్‌లో జూన్ 5 నుండి 8 వరకు పబ్లిక్ పార్కింగ్ ఉచితం. సెలవు దినాలలో బహుళ-స్థాయి పార్కింగ్ టెర్మినల్స్ చెల్లింపు సేవగా ఉంటాయి.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్