బెంగళూరు తొక్కిసలాటపై కపిల్ దేవ్ స్పందన

- June 05, 2025 , by Maagulf
బెంగళూరు తొక్కిసలాటపై కపిల్ దేవ్ స్పందన

బెంగళూరు: ఐపీఎల్ 2025 (IPL 2025) టైటిల్ గెలిచిన సందర్భంగా ఆర్సీబీ నిర్వహించిన వేడుకలు విషాదంలో ముగిశాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.విజయోత్సవాల్లో వేలాది మంది అభిమానులు జమయ్యారు. అయితే ఏర్పాట్ల లోపం వల్ల భారీ గుంపు ఒక్కసారిగా తొక్కిసలాటకు దారితీసింది. ఈ దుర్ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

వేడుకలకు కంటే ప్రాణాలే ముఖ్యమని కపిల్ దేవ్
ఈ సంఘటనపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు.ఇలాంటి ఘటనలు మనమందరినీ ఆలోచింపజేస్తాయి. సంబరాల కంటే ప్రాణాలే ముఖ్యం. ప్రతి ఒక్కరు బాధ్యతతో ప్రవర్తించాలి అని ఆయన వ్యాఖ్యానించారు.విజయాన్ని ఆనందంగా జరుపుకోవడం మంచిదే కానీ, అప్రమత్తత అవసరం అని కపిల్ సూచించారు. సరదా కోసం ప్రాణాలు పోవడం అత్యంత దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు, అని అన్నారు.

నిర్వాహకులు, జట్లు మరింత జాగ్రత్తగా ఉండాలి
ఇలాంటి భారీ వేడుకల్లో నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. జట్లు, నిర్వాహక సంస్థలు భద్రతను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో జాగ్రత్తే రక్షణ
ఈ సంఘటన క్రికెట్ అభిమానుల మనసుల్లో బలమైన ముద్ర వేసింది. రాబోయే కాలంలో ఈ తరహా వేడుకలు నిర్వహించేటప్పుడు మునుపటి తప్పులను పునరావృతం కాకుండా చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com